NTV Telugu Site icon

Hyundai Alcazar 2024: ‘హ్యుందాయ్ అల్కాజార్’ నయా వెర్షన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Hyundai Alcazar 2024 Price

Hyundai Alcazar 2024 Price

Hyundai Alcazar 2024 Launch and Price Details: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ సోమవారం తన సెవెన్‌ సీటర్‌ ఎస్‌యూవీ అల్కజార్‌ సరికొత్త వెర్షన్స్‌ను విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.14.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్‌ ధర రూ.15.99 లక్షలతో కంపెనీ లాంచ్‌ చేసింది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు. క్రెటా తర్వాత ఈ సంవత్సరంలో అల్కజార్‌ సరికొత్త వెర్షన్స్‌ను హ్యుందాయ్ రిలీజ్ చేసింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్, టాటా సఫారి, ఎంజీ హెక్టర్ ప్లస్, కియా కారెన్స్ వంటి వాటికి అల్కజార్‌ గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం 6/7-సీటర్ ఎస్‌యూవీ అల్కజార్‌. ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్ వేరియంట్‌లు ఇందులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ 7-సీటర్ వేరియంట్‌ ఎంట్రీ-లెవల్ అల్కజార్‌ పెట్రోల్ ధర రూ.14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), బేస్ ఆల్కజార్ డీజిల్ ధర రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హ్యుందాయ్ అల్కాజార్ అమ్మకాలు గత కొన్ని నెలలుగా బాగున్నాయి. ఈ నయా వెర్షన్ రావడంతో విక్రయాల సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

Also Read: Mercedes-Benz: సింగిల్ ఛార్జింగ్‌పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్‌ బెంజ్‌’!

2024 హ్యుందాయ్ అల్కాజార్ హెచ్-ఆకారంలో కనెక్ట్ చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, బిగ్ రేడియేటర్ గ్రిల్, బచ్-లుకింగ్ ఫ్రంట్ ఫేస్‌తో కూడిన బోల్డ్-లుకింగ్ డిజైన్ థీమ్‌ ఉంది. ఇందులో 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, పెద్ద రియర్ క్వార్టర్ విండోస్, బ్లాక్-పెయింటెడ్ క్లాడింగ్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్స్ మార్పులు చేశారు. కొత్త స్పాయిలర్, రీవర్క్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ కోసం కొత్త డిజైన్‌తో భారీ సర్దుబాట్లు చేశారు. గత మోడల్‌తో పోల్చితే.. 60 మిమీ పొడవు, 10 మిమీ వెడల్పు, 35 మిమీ పొడవు అధికంగా ఉంటుంది. ఇంటీరియర్‌లోనూ డ్యాష్‌బోర్డ్‌తోపాటు మరికొన్ని మార్పులు చేశారు. ఇందులో 1.5లీటర్‌ డీజిల్, 1.5లీటర్‌ టర్బో-పెట్రోల్ ఎంపికలు ఉన్నాయి. మూడు డ్రైవ్ మోడ్‌లు (నార్మల్‌, ఎకో, స్పోర్ట్), మూడు ట్రాక్షన్ మోడ్‌లు (స్నో, మడ్‌, శాండ్‌) ఉ‍న్నాయి. ఇది 9 రంగులలో అందుబాటులో ఉంది.