Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన హ్యుండాయ్.. ఎలక్ట్రిక్ వేరియంట్‌ని కూడా పరిచయం చేసేందుకు సమాయత్తమవుతోంది.
హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును కంపెనీ భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ కూడా చేపట్టింది. ఆ సమయంలో పలుమార్లు కెమెరాలకు కారు చిక్కింది. ఐయితే ఈ కారు పూర్తిగా కప్పి ఉంచడంతో.. దాని డిజైన్ ఎలా ఉంటుందో తెలియరాలేదు. క్రెటా ఫేస్ లిఫ్ట్ మాదిరిగానే ఉండే అవకాశాలు ఉన్నాయట. స్టాండర్డ్ మోడల్ లాగే డిజైన్ ఉండే అవకాశం ఉంది. గ్రిల్, లోగో, చార్జింగ్ పోర్ట్, వెనుకవైపు బంపర్స్ రీ డిజైన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read: Gadchiroli Encounter: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి!
హ్యూందాయ్ క్రెటా ఈవీలో దాదాపు స్టాండర్డ్ మోడల్ క్రెటా ఎస్‌యూవీ మోడల్లో ఉన్నట్లే ఇంటీరియ్ ఉంటాయి. అయితే కొన్ని ఫీచర్లు అదనంగా రానున్నాయట. రెండు స్క్రీన్లలో ఒకటి ఇన్ఫోటైన్ మెంట్, ఇంకోటి ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉంటాయి. డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్ లెస్ కార్ ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీల కెమెరా, లెవెల్ 2 అడాస్ స్యూట్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. 45 కేడబ్ల్యూ నుంచి 50 కేడబ్ల్యూ మధ్య బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో450 కిలోమీటర్ల ప్రయాణం అందిస్తుంది. భారతదేశంలో క్రెటా ఈవీ ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చు.