Site icon NTV Telugu

Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనాలని చూస్తున్నారా.. మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే

Hyundai Creta Ev

Hyundai Creta Ev

Hyundai Creta : హ్యుందాయ్ కంపెనీ పాపులర్ కారు క్రెటాను కొనుగోలు చేసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దాని డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా కంపెనీ తన వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పెంచాల్సి వచ్చింది. అంటే ఈరోజే హ్యుందాయ్ క్రెటా, క్రెటా N లను బుక్ చేసుకుంటే వాటి డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కనీసంలో కనీసం డెలివరీ కోసం 3 నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. అయితే, ఈ వేచి ఉండే వ్యవధిని కొన్ని నగరాలకు మాత్రమే పొడిగించారు. ఏయే నగరంలో ఎంత వెయిటింగ్ పిరియడ్ ఉందో చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీలో నివసిస్తున్న వాళ్లకు క్రెటా డెలివరీ పొందడానికి 1 నెల, క్రెటా N లైన్ కోసం ఒక నెల వేచి ఉండాలి. బెంగళూరులో క్రెటా, క్రెటా N కోసం వేచి ఉండే కాలం ఒకటి నుండి ఒకటిన్నర నెలలు. ముంబైలో 2 నెలలు, హైదరాబాద్‌లో 1 నుండి 2 నెలలు, పూణేలో నివసిస్తుంటే క్రెటా కోసం గరిష్టంగా 2-3 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు. గురుగ్రామ్‌లో నివసిస్తుంటే 2 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు, నోయిడాకు కూడా 2 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు.

Read Also:Asteroid 2024 YR4: భూమి వైపు ‘‘సిటీ కిల్లర్’’ గ్రహశకలం.. అడ్డుకునేందుకు ‘‘నాసా’’ ప్లాన్స్ ఇవే..

హ్యుందాయ్ క్రెటాలో లెవల్-2 ADAS తో 70 అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. దీని 7 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో E, EX, S, S(O), SX, SX Tech, SX (O) వేరియంట్‌లు ఉన్నాయి. దీనిలో ముందు, వెనుక USB పోర్ట్‌తో మాన్యువల్ AC పొందుతారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది కానీ దీనిని i20, ఎక్సెటర్ తో షేర్ చేశారు. ఈ కారులో సెంట్రల్, రిమోట్ లాకింగ్ సిస్టమ్‌ అమర్చారు. హ్యుందాయ్ క్రెటా లీటరుకు 17.4 నుండి 21.8 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.

ధర ఎంత?
హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ. 11 లక్షల నుండి రూ. 20.42 లక్షల మధ్య ఉంటుంది. ఈ ధర క్రెటా పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లకు వర్తిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ధర రూ. 22.57 లక్షలు. వివిధ నగరాల్లో ఈ ధర మారవచ్చు.

Read Also:RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Exit mobile version