Site icon NTV Telugu

Pakistan Election 2024: పాక్ ఎన్నికల్లో బలూచిస్థాన్ ప్రజలు పాల్గొనకూడదని విజ్ఞప్తి..

Baluchisthan

Baluchisthan

రేపు జరిగే పాకిస్తాన్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బలూచిస్తాన్ ప్రజలు పాల్గొనకూడదని ఫ్రీ బలూచిస్తాన్ ఉద్యమం ఛైర్మన్ హేబర్ మర్రి కోరారు. బలూచ్ ప్రజల హక్కులను విస్మరిస్తూ, పాకిస్తాన్‌లో ఎన్నికలు కేవలం పాకిస్తానీ రాజకీయ నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి.. ప్రధానంగా పంజాబ్‌ ప్రావిన్స్ కు అనుకూలంగా ఉంటాయని ఆయన ఆరోపించారు.

Read Also: ICICI Bank Loan Fraud : చందా, దీపక్ కొచ్చర్ అరెస్టు చట్టవిరుద్ధం.. సీబీఐని మందలించిన హైకోర్టు

అయితే, ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల తమ బలుచ్ ప్రజల యొక్క ప్రాముఖ్యతను గురించి ఫ్రీ బలూచిస్తాన్ ఉద్యమ అధ్యక్షుడు హేబర్ మర్రి వెల్లడించారు. ప్రత్యేక బలూచ్ గుర్తింపును ప్రపంచానికి చాటుతుంది.. బలూచ్ పోరాటానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బలూచిస్తాన్‌లో హత్యలు, బలవంతపు అదృశ్యాలతో సహా బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను కూడా చట్టబద్ధం చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఇక, ఎన్నికలలో పాల్గొనకుండా ఉండటం ద్వారా, బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోవడాన్ని పునరుద్ఘాటించవచ్చన్నారు.

Read Also: Shiva Balakrishna: హెచ్ఎండిఎ మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ కేసు.. సోదరుడు శివ నవీన్ అరెస్ట్..

ఇక, పాకిస్తాన్ బలూచిస్తాన్‌ను అక్రమంగా ఆక్రమించుకున్నందున బలూచ్‌కు పాకిస్తాన్ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని మేము ప్రపంచానికి చాటి చెప్తామని హిర్బియర్ మేరీ వెల్లడించారు. మన హక్కులను పరిరక్షించడానికి.. మన స్వేచ్ఛను కాపాడుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.. పాకిస్తాన్ ఎన్నికలలో పాల్గొనకపోవడం మన విజయానికి దారి తీసే ఒక అవకాశం అని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ రాజ్య క్రూరత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్‌ను ఆచరణాత్మకంగా సమర్థించే బలూచ్ కార్యకర్త త్యాగం ఎంత విలువైనదో ఈ ఎన్నికల బహిష్కరణ కూడా అంతే విలువైనది అని హిర్బియర్ మేరీ అన్నారు.

Exit mobile version