Site icon NTV Telugu

Hypersonic Aircraft: గంటకు 6000 కి.మీ స్పీడ్ తో జర్నీ.. అరగంటలోనే కాశ్మీర్ టు కన్యాకుమారి

Hypersonic Aircraft

Hypersonic Aircraft

స్విట్జర్లాండ్ కు చెందిన ఏరో స్పేస్ కంపెనీ డెస్టినస్ ఇప్పుడు హైపర్ సోనిక్ విమానాల తయారీ రేసులో యమస్పీడ్ గా దూసుకుపోతోంది. ఆ కంపెనీ డెవలప్ చేసిన హైపర్ సోనిక్ విమానం జంగ్‌ఫ్రాను మొదటిసారి 2021 నవంబర్ 19వ తారీఖునే జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్ పోర్ట్ లో టెస్ట్ చేశారు. తాజాగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన వివా టెక్నాలజీ ట్రేడ్ షోలో దీన్ని ప్రదర్శించారు. జంగ్‌ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో ఒక మోడల్ కారు సైజులో.. మరో మోడల్ బస్సు సైజులో ఉంటాయి.

Read Also: Viral News: రూ.18 కే సైకిల్.. అవాక్కవుతున్న జనం

ఈ విమానంలో ఒకే టైంలో 400 మంది ప్రయాణం చేయొచ్చు. దీని స్పీడ్ కెపాసిటీ మాక్ 5.. అంటే కాంతి వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గంటకు 6 వేల కిలో మీటర్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. జంగ్‌ఫ్రా హైపర్ సోనిక్ విమానాల్లో హైడ్రోజన్ ఆధారిత ఆఫ్టర్‌ బర్నర్ సిస్టమ్‌ ఉంటుంది. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విమానంతో గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లింది. ప్రస్తుతం మనం జర్నీ చేస్తున్న విమానాల స్పీడ్ (గంటకు 900 కిలో మీటర్లు) కూడా ఇంతకంటే ఎక్కువే ఉంటుంది.

Read Also: Guillain Barre Syndrome: విశాఖలో వెలుగు చూసిన అరుదైన వ్యాధి.. ఏకంగా 70 రోజుల పాటు..

అయితే 2024కల్లా మాక్ 5 లెవల్ స్పీడ్ తో దీని ట్రయల్ పూర్తి చేయాలని డెస్టినస్ కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. 2035 కల్లా అన్ని లోపాలను అధిగమించి హైపర్ సోనిక్ విమానాన్ని తీసుకురావాలనే పట్టుదలతో డెస్టినస్ ఉంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి (3676 కిలోమీటర్ల దూరం) విమానంలో వెళ్లేందుకు 4 గంటలకుపైనే సమయం పడుతోంది.. ఒకవేళ హైపర్‌సోనిక్ విమానాల్లో ప్రయాణిస్తే కేవలం అర్థగంటలోనే కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి వెళ్లొచ్చు. ఇవి గంటకు 6,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ఆకాశ వీధిలో దూసుకెళ్లగలవు.

Exit mobile version