NTV Telugu Site icon

Hyper Aadi : హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలే ఆయనకి ఫ్యాన్స్..

Hper Adi

Hper Adi

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు..దర్శకుడు మెహర్ రమేష్‌ ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఆది ఇచ్చిన స్పీచు మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు, గుర్తు చేసిన విషయాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాలు, రాజకీయాలు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మీద వచ్చిన విమర్శలు ఇలా ఒక్కటేంటి.. మెగా ఫ్యామిలీ మీద వచ్చే సమాధానాలు ఇచ్చాయి..

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు సినిమా పై, మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు… ఈ క్రమంలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ..మధ్య తరగతి వాడు యుద్దం చేసేందుకు వచ్చాడు.. అప్పటి వరకు ఎంతో మంది యుద్దం చేస్తూనే ఉన్నారు.. ఒకసారి ఆయనకు చాన్స్ వచ్చింది.. యుద్దం చేశాడు.. ఆ యుద్దభూమికి సైన్యాధిపతి అయ్యాడు.. ముప్పై ఏళ్లుగా ఆ యుద్దభూమిని ఏలుతూనే ఉన్నాను.. ఆయనే చిరంజీవి.. చిత్రపరిశ్రమను ఏలుతూనే ఉన్నాడు.. అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారు చేసి ఇంద్ర సేనాని అయితే.. అక్కడ తమ్ముడేమో జన సైనికుల్ని తయారు చేసి జన సేనాని అయ్యాడు.. రామ్ చరణ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ఆది.

అలాగే మెగాస్టార్ పేరు వినగానే అందరికి గూస్ బంప్స్ వస్తాయి.. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్..గా ఉంటారు.. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. పాత తరానికి కొత్త తరానికి వారధి.. ఇన్ని కోట్ల మంది అభిమానులకు సారథి.. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో తెలియదు గానీ ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు.. నా దృష్టిలో సచిన్, చిరంజీవి ఒక్కరే.. క్రికెట్‌లో విమర్శలు వస్తే.. సచిన్ బ్యాటింగ్‌తో సమాధానం ఇస్తాడు.. సినిమాల్లో విమర్శలు వస్తే.. చిరంజీవి గారు సినిమాలతోనే సమాధానం ఇస్తారు..ఆచార్యతో విమర్శలు, వాల్తేరు తో సమాధానం చెప్పారు.. అలాగే ఇప్పుడు భోళా శంకర్ కూడా అంతకు మించి ఉంటుందని ఆది మెగా ఫ్యామిలిపై పొగడ్తలు కురిపించి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..