NTV Telugu Site icon

Hyper Aadi: నందమూరి, కొణిదెల సింహాలు అసెంబ్లీలో అడుగుపెడితే వచ్చే కిక్కు మా సినిమా కూడా ఇస్తుంది!

Hyper Adi Speech

Hyper Adi Speech

Hyper Aadi Energetic Speech at Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ హనుమంతుడు ఉన్నచోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలు పెడతాం, శ్రీరాముడు ఉన్నచోట జైశ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలుపెడతాం, అలాగే బాలయ్య బాబు ఉన్నచోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలుపెడదాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోబోయే ముందు ఇప్పుడు మరొకరు గురించి మనం ముందు మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగు వాడిని అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాం అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడిగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టుకున్నాము, శ్రీరాముడిగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం. అలాగే మీరందరూ గమనించినట్లయితే రామారావు గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగాను.

Naga Chaitanya: తండేల్ కోసం తొమ్మిది నెలలు.. సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ

ఆయన నటించిన బొబ్బిలి పులి సినిమా చూశారా? చివరిలో 15 నిమిషాల కోర్టు సీను ఉంటుంది ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ మాడ్యులేషన్. అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు, అలాంటి నాయకులు మళ్లీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ సమక్షంలో ఆయన నూట ఒకటవ జయంతి సందర్భంగా సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒకపక్క దమ్మున్న సినిమాలు చేస్తూ మరో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. మీరందరూ గమనించినట్లయితే చాలామంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు కానీ బాలకృష్ణ గారు వేలమంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు, అది రాయాలి. సినిమాలు, రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఎంతమందికి భయం బాధ్యతా ఉన్నాయో నాకు తెలియదు కానీ బాలకృష్ణ గారితో పని చేసే ప్రతి ఒక్కరికి ఆ భయం బాధ్యత రెండు ఉంటాయి, ఇదైతే ఖచ్చితం.

బాలకృష్ణ గారి సినిమాలు చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి. నాకు కూడా కొన్ని సినిమాలు ఇష్టం. అందులో బొబ్బిలి సింహం అనే సినిమాలో వైట్ అండ్ వైట్ పంచ కట్టుకుని నడుస్తూ ఉంటుంటే వెనుక శ్రీరాముడు శ్లోకం వస్తూ ఉంటుంది. మీనా గారు అలా చూస్తూ ఉండిపోతారు నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్లీ పంచ కట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు మాత్రమే. నిజంగా మీరందరూ అదృష్టవంతులు ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు. ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ద్వీపాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగితే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము కాలర్ ఎగరేసే సినిమాలు కావాలన్నారు సింహా లాంటి సినిమా మీకు ఇచ్చారు. ఇంకొక జనరేషన్ వాళ్ళు మాకు మీసం తిప్పే సినిమా కావాలన్నారు లెజెండ్, అఖండ భగవంతు కేసరి ఇలాంటి సినిమాలు ఇచ్చారు. జనరేషన్లు మారిన ఏంట్రా బాలకృష్ణ గారి ఎనర్జీ అలా ఉందని అడుగుతూ ఉంటారు. జనరేషన్లో మారితే మనుషులు మారతారు టెక్నాలజీలు మారుతాయి కానీ బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతుంది రా బ్లడీ ఫూల్ అని చెప్పండి.

స్టాక్ మార్కెట్ పెరగటం, తరగడం ఉంటుంది కానీ ప్రజెంట్ బాలయ్య బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగడం తప్ప తగ్గడం లేదు. అటుపక్క సినిమాలలో అన్ స్టాపబుల్, ఓటీటీలో అన్ స్టాపబుల్ రాజకీయాలలో అన్ స్టాపబుల్, సేవ చేయడంలో అన్ స్టాపబుల్ ఎవడైనా అనవసరంగా మధ్యలో దూరిన వాడిని కొట్టడంలో అన్ స్టాపబుల్, అవసరం అని అడిగినవాడికి పెట్టడంలో అన్ స్టాపబుల్. అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్సాఫ్ గోదావరి ఈవెంట్ కి రావడం నిజంగా మా గ్యాంగ్సాఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్ స్టాపబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య స్లొగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ ఎక్కిస్తుంది. బాలకృష్ణ గారు చేతిలో ఉన్న మైక్ ఎగరేసి మళ్ళీ క్యాచ్ పడితే ఎంత కిక్ వస్తుందో మా సినిమా చూస్తే అంతకు వస్తుంది.

బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి విసిరేస్తున్నప్పుడు ఎంత కిక్కు వస్తుందో మా సినిమా చూస్తే అంత క్లిక్ వస్తుంది. పద్ధతిగా ఫోటో దిగాల్సిన వాడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్కు వస్తుందో మా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా అంతకు వస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ సినిమా కూడా అంతే కిక్ ఎక్కిస్తుంది. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే మెన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా సినిమా అంతే కిక్కిస్తుంది. ఒక్క మాట బాలయ్య బాబు గారు పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను. రేపొద్దున నందమూరి నటసింహం, కొణిదల కొదమ సింహం అసెంబ్లీలో అడిగి పెడితే ఎంత కిక్కు వస్తుందో, మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్కిస్తుంది. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

Show comments