Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల్లో వెలసిన పాత లేఅవుట్ల విషయంలో ‘హైడ్రా’ (HYDRAA) స్పష్టతనిచ్చింది. ఈ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు, క్రమబద్ధీకరణ (Regularization) కాని ఖాళీ ప్లాట్లపై కూడా ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు ఉండవని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. యూఎల్సీ భూముల్లోని ఖాళీ ప్లాట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని లేదా హైడ్రా కూల్చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి భయాందోళనలు సృష్టించి, తక్కువ ధరకే ప్లాట్లను కాజేయాలని చూసే కబ్జాదారుల మాటలను నమ్మవద్దని సంస్థ కోరింది.
లేఅవుట్ నిబంధనల ప్రకారం రోడ్లు, పార్కులు , ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురైతే మాత్రమే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రజల ఉమ్మడి ఆస్తులను కాపాడటమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటుకు (19.07.2024) ముందే నిర్మించిన నివాసాలను తాము ముట్టుకోబోమని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు సంస్థ పునరుద్ఘాటించింది.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read:627 కిలోమీటర్ల రేంజ్.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నగర్, ఓయూ కాలనీ, రాఘవేంద్ర కాలనీల్లో కేవలం పార్కులు, రోడ్ల స్థలాల్లో వెలసిన ఆక్రమణలను మాత్రమే తొలగించినట్లు సంస్థ పేర్కొంది. అలాగే హైదర్‌నగర్‌లోని గోపాల్ నగర్ లేఅవుట్ పార్కును కూడా కబ్జా నుంచి కాపాడినట్లు వెల్లడించింది. నివాసితులకు ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించి క్లారిటీ తీసుకోవాలని సూచించింది. మీ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని నగర ప్రజలను అప్రమత్తం చేసింది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!