Site icon NTV Telugu

Hydra: హైడ్రాలో ఆటవిడుపు.. బౌండరీలు కొట్టిన చీఫ్ రంగనాథ్!

Hydraa

Hydraa

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా వందల కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడింది. నిత్యం విధులతో బిజీగా ఉండే హైడ్రా సిబ్బంది తాజాగా క్రికెట్ ఆడి సేదతీరారు.

Also Read: Diwali 2025: దీపావళికి స్వీట్స్ కొంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

హైడ్రా సిబ్బంది క్రికెట్‌తో సేదతీరారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ బ్యాట్ పట్టి బౌండరీలు కొట్టారు. హైడ్రాలో అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడారు. ఫతుల్గుడాలోని హైడ్రా క్రికెట్ గ్రౌండ్లో ఫ్లడ్ లైట్ల కాంతిలో హైడ్రా సిబ్బంది మ్యాచ్ ఆడారు. చక్కటి సమన్వయంతో కలసికట్టుగా పని చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నిత్యం ఇదే స్ఫూర్తితో, ఉత్సాహంతో పని చేసి నగర ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి కమీషనర్ సూచించారు.

Exit mobile version