హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.
Also Read:Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు – పండుగ ప్రత్యేకతలు
కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను మాత్రమే తొలగిస్తామని హైడ్రా చెబుతోంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబుల ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా తెలిపింది. పేదవారిని ముందు పెట్టి.. బడాబాబులు వేయించిన షెడ్డుల తొలగించారు.
గాజులరామారం కూల్చివేతలపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్‌లోని గజులరామారం సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నాం.. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీస్ విభాగం సంయుక్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామన్నారు. సుమారు 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నారని తెలిపారు. స్థానిక రాజకీయ నాయకులు పేదలకు 50, 100 గజాలుగా విక్రయించినట్లు విచారణలో బయటపడిందని తెలిపారు.
ఈ విషయంపై గత 6 నెలల్లో అన్ని శాఖల అధికారులతో ఐదు సార్లు సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ అనుమతులు పొందిన తరువాతే ఈరోజు ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. పేదల ఇళ్ళు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.. పొలిటీషియన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు.. కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ వాల్‌లు, గదులు కట్టుకొని ఆక్రమించిన భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.. కొందరికి ఇచ్చిన పత్రాలు ఫోర్జరీ చేసిన నకిలీ పత్రాలుగా బయటపడడంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేస్తున్నారు.. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ చేస్తామని తెలిపారు. ఈ భూముల అంచనా విలువ రూ. 12 నుంచి 15 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.
