Site icon NTV Telugu

HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!

Hydra

Hydra

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా MA&UD సెక్రటరీ కూడా జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన టీ కప్పులో తుఫాను లాంటిదని అభివర్ణించారు.

MLA Rajagopal Reddy: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్!

ఈ విషయమై ఇతర రాష్ట్రాల పరిస్థితిని కూడా సమీక్షించి, ఆ ఆధారంగా జీతాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరిగితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే, ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైమ్ చెల్లింపులు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా కమిషనర్ రంగనాథ్ భరోసా ఇవ్వడంతో ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో జీతాల తగ్గింపుపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

Hansika: విడాకుల రూమర్స్ మధ్య.. హన్సిక ఎమోషనల్ పోస్ట్

Exit mobile version