Site icon NTV Telugu

Lottery : లక్కంటే ఈమెదే.. లాటరీలో రూ.2.2కోట్లు

Hyderabad Woman

Hyderabad Woman

Lottery : హైదరాబాదుకు చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా రెండ్లుకోట్లు గెలుచుకుంది. ఆమె పేరు హమీదా బేగం. వయస్సు 38 సంవత్సరాలు. ఆమె సాధారణ జీవితాన్ని గడుపుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన వీక్లీ మహ్జూజ్ డ్రాలో ఆమె 10 లక్షల దిర్హామ్‌లు (రూ. 2,22,28,303) గెలుచుకుంది. శనివారం, ఏప్రిల్ 1, 2023న డ్రా అయిన 122వ వారపు మెహజుజ్ డ్రాలో… విజేత హమెదకి… లాటరీ టిక్కెట్‌లోని ఆరు నంబర్‌లలో 5 సరిపోలాయి. అకస్మాత్తుగా ఆమె జీవితం మారిపోయింది. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. హమేదా.. యూఏఈలో మెడికల్ కోడర్‌గా పనిచేస్తోంది. మూడేళ్లుగా ఆమె తన భర్తతో కలిసి యూఏఈ రాజధాని అబుదాబిలో ఉంటోంది. “నేను నా జీవితంలో ఏదీ గెలవలేదు. కాబట్టి ఈ విజయం నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఇది నాకు సాకారమైన కల లాంటిది. నేను నమ్మలేకపోతున్నాను, ”అని ఆమె గల్ఫ్ న్యూస్‌తో అన్నారు.

Read Also: Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉత్తర్వులు జారీ

లాటరీలో వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని తన నలుగురు పిల్లల చదువుల కోసం కేటాయించి మిగిలిన మొత్తాన్ని భర్తకు ఇవ్వాలని హమేదా నిర్ణయించుకుంది. కొత్త ప్రైజ్ సిస్టమ్ ప్రకారం… 10 లక్షల దిర్హామ్‌లను గెలుచుకున్న నాల్గవ వ్యక్తి హమెదా. అంతేకాదు ఆమె మొదటి మహిళ కూడా. మార్చి 4 న, బహుమతి విధానంలో మార్పులు చేయబడ్డాయి. కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారం.. ప్రతి వారం లాటరీలో పాల్గొనేవారిలో ఒకరు కోటీశ్వరుడు కావాల్సి ఉంటుంది. విరాళాలు ఇచ్చే అవకాశం ఉన్నందున ఇక నుంచి లాటరీని కొనుగోలు చేస్తానని హమీదా తెలిపారు.

Read Also: NIA: భారత హైకమిషన్‌‌పై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి.. ఎన్ఐఏ విచారణ

Exit mobile version