Site icon NTV Telugu

Wife Protest: రెండో పెళ్లికి సిద్ధమైన సాఫ్ట్‌వేర్ భర్త.. తల్లితో కలిసి న్యాయ పోరాటం చేస్తున్న భార్య..!

Software Marriage

Software Marriage

Wife Protest: ప్రస్తుత కాలంలో పెళ్లి అంటేనే చాలామంది భయపడే పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య సమస్యలు, మర్డర్లు వాటిని చూసి ప్రజలు బయపడుతున్నారు. మరికొందరైతే, ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న తరువాత వారి బంధాన్ని వదిలించుకునేందుకు చేసే వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎలా ఇలా పాల్పడుతున్నారు అంటూ మండిపడుతున్నారు ప్రజలు. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్న తరువాత భార్యను వదిలించుకునేందుకు వివిధ మార్గాలను చేస్తుండడంతో.. వారిలో కొందరు తమ గౌరవాన్ని, హక్కులను కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘట్టం తాజాగా హైదరాబాద్‌ శివార్లలోని షాకోట్ హిమగిరి కాలనీలో వెలుగుచూసింది.

Read Also: CM Revanth Reddy: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్రవంతిని వదిలేసి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య స్రవంతి, తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ప్లేకార్డులు పట్టుకొని పోరాటం చేస్తుంది. నీవు అంటే నాకు ఇష్టం.. నీవే నా సర్వస్వం.. నీవు లేకుండా బ్రతకలేను.. అంటూ వెంట పడడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీధర్ కుమార్ ను తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన స్రవంతి, తన తల్లిదండ్రులను ఎదురించి అతనితో వివాహం చేసుకుంది. అయితే, వివాహం జరిగిన నాలుగు నెలల నుంచే శ్రీధర్ అసలు రంగు బయటపెట్టాడు. ఆమెకు భౌతిక, మానసిక పరిస్థుతలకు ఇబ్బందులు కలిగిస్తూ.. పిల్లలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తరచూ టాబ్లెట్లు ఇచ్చేవాడని ఆమె ఆరోపించింది. చివరికి మోజు తీరిన తరువాత.. నీతో అవసరం లేదు.. నా ఇంట్లో నుండి వెళ్లిపో.. నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Read Also: Anderson–Tendulkar Trophy: రేపటి నుండే ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌.. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ..!

ఇలాంటి వేధింపులకు తాళలేక స్రవంతి భర్త ఇంటి ముందు మౌన నిరసన ప్రారంభించింది. నాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అంటూ భీష్మించి కూర్చుని తనకి న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమెకు తోడుగా తల్లి కూడా ఈ నిరసనలో పాల్గొంటోంది. చూడాలిమరి ఈ సమస్యను ఎలా ముగిస్తారో.

Exit mobile version