Site icon NTV Telugu

Heavy Rain Alert: అలర్ట్.. హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. మరో 2 గంటల్లో..

Telangana Rain Alert

Telangana Rain Alert

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగర ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ అంతటా కుములోనింబస్ తుఫాను విస్ఫోటనం జరుగుతోందని వెల్లడించింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రదేశాల్లో భారీ వర్షం కురువనుందని తెలిపింది. ఇళ్లకు వెళ్లే వాళ్లు త్వరగా బయలు దేరాలని సూచించింది.

READ MORE: Machilipatnam: మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం.. మచిలీపట్నంలో హైటెన్షన్..

ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీ, తెలంగాణకు ఈ రోజు ఉదయం వాతావరణశాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… హైదరాబాద్‌తో సహా నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఉదయం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

READ MORE: Asaduddin Owaisi: ఓటర్ లిస్ట్‌లో విదేశీయులు కనిపిస్తారు.. పహల్గాం ఉగ్రవాదులు మాత్రం కనిపించరా..?

ఇక ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Exit mobile version