వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు.. ఎల్బీనగర్ లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
Also Read : Bandi Sanjay : వాళ్ల ఒత్తిడితోనే ఎస్ఐ సస్పెండ్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు నెంబర్ ప్లేట్లు లేని 48,998 వెహికిల్స్ ను మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేశామని జాయింట్ సీపీ వి. సత్యనారాయణ వెల్లడించారు. దొంగతనం, చైన్ స్నాచింగ్, హత్యలు చేసేవారు, మారక ద్రవ్యాలు సరఫరా చేసేవారు ఎక్కువగా నెంబర్ ప్లేట్లు లేని వెహికిల్స్ నే ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు.
Also Read : Karnataka Elections: సీఎం ఎవరనేదానిపై అస్సలు మాట్లాడొద్దు.. కాంగ్రెస్ అధిష్టానం సూచన
ప్రజల సంక్షేమం కోసం, నేరాలను నియంత్రించేందుకు నెంబర్ ప్లేట్లు వాడని వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపినా, మాస్క్ లతో నెంబర్ ప్లేట్స్ కవర్ చేసినా మోటర్ వెహికల్ చట్టం ప్రకారం.. మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమాన విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని వెల్లడించారు.
Also Read : Pavala Shyamala: బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
అయితే ఇటీవల కాలంలో పోలీసుల తనిఖీల్లో తరచూగా పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధించడం జరిగిందని జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ హరికృష్ణ, మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు కూడా పాల్గొన్నారు.
