Site icon NTV Telugu

VC Sajjanar: చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. చేతిలో స్మార్ట్‌ఫోన్! చెల్లించక తప్పదు భారీ మూల్యం

Sajjanar

Sajjanar

VC Sajjanar: రయ్… రయ్… మంటూ రోడ్డుపై పరుగులు పెడుతున్న వాహనాలు.. డ్రైవింగ్ సీటులో డ్రైవర్… కానీ, వారి దృష్టి రోడ్డుపై లేదు. చేతిలో మొబైల్ ఫోన్… లేదా చెవుల్లో ఇయర్‌ఫోన్స్. ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఇలా చేస్తూ నగరంలో తరచుగా కనిపిస్తున్నారు. తమ జీవితంతో పాటు, ప్రయాణికుల, రోడ్డుపై ఉన్న వేలాది మంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడడం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం చట్టరీత్యా నేరం. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రాణాలు తీసే నేరం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం వల్ల దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలల్లో ప్రమాదాలు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

FASTag లేకపోతే ఇక బాదుడే.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..

ఈ ప్రమాదకర ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ VC సజ్జనార్. జరిమానాలు, చట్టాలు… ఇవన్నీ ఒకవైపు. డ్రైవర్, ప్రయాణికులు, ఇతర రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత అత్యంత ముఖ్యమైనది. క్షణికావేశంలోనో, చిరు కాలక్షేపం కోసమో చేసే చిన్న పొరపాటు తీరని విషాదాన్ని మిగులుస్తుంది. జీవితం కంటే పెద్దది ఏ సమస్య కాదు. డబ్బు సంపాదించడం, ఎక్కడికో త్వరగా చేరుకోవడం, ఫ్రెండ్స్ తో మాట్లాడటం.. ఏదీ మీ ప్రాణం, మీ కుటుంబ ఆనందం కంటే ముఖ్యం కాదు.

సరికొత్త డిజైన్, ఫీచర్లతో 2025 Mahindra Bolero, Bolero Neo లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా

Exit mobile version