NTV Telugu Site icon

IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్! కోహ్లీ స్థానంలో రాహుల్

Untitled Design (1)

Untitled Design (1)

IND vs ENG 1st Test Playing 11 Out: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో జరగనున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది.

వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చినా రజత్ పటిదార్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఆడే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. మూడో స్థానములో గిల్, ఐదవ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు. శ్రీకర్ భరత్ కీపర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్లు స్పిన్నర్లు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

టెస్ట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో నగరంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్‌డ్‌ ఫోర్స్, ఎస్‌బీ, సీసీఎస్, ఎస్‌ఓటీ, ఐటీ సెల్‌ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. మైదానం చుట్టూ 360 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గేట్‌ నంబరు–1 కేవలం ఆటగాళ్ల కోసమే కేటాయించారు. మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించారు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ( కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.