Fake Doctors: హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని, వీరు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకంగా క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటువంటి అర్హత లేకపోయినా రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు నగరంలో ఎక్కడెక్కడ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు? ఏ ఏ విశ్వవిద్యాలయాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొందుపరిచారు? రోగులకు ఎలాంటి వైద్యం, మందులు అందిస్తున్నారు? అనే కీలక అంశాలపై పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు. అర్హత లేని నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..

Hyderabad Task
