NTV Telugu Site icon

Hyderabad Student: చికాగోలో హైదరాబాద్‌ విద్యార్థిపై దాడి.. కేంద్రం సాయం కోరిన కుటుంబ సభ్యులు!

Pawan Kalyan

Pawan Kalyan

Hyderabad Student Attacked By Four Men In Chicago: అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మజాహిర్‌ అలీపై చికాగోలో దాడి జరిగింది. హోటల్‌ నుంచి ఇంటికెళ్తున్న మజాహిర్‌ అలీపై నలుగురు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అతడి తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గత శనివారం (ఫిబ్రవరి 4) చికాగోలోని క్యాంప్‌బెల్ ఏవ్‌లో జరిగింది.

హైదరాబాద్‌ విద్యార్థి సయ్యద్‌ మజాహిర్‌ అలీ.. ఇండియానా వెస్లే యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉన్నత చదువు కోసం వెళ్ళాడు. గత శనివారం క్యాంప్‌బెల్ ఏవ్‌లోని హోటల్‌ నుంచి ఆహరం తీసుకుని ఇంటికి వెళుతుండగా.. రోడ్డుపై నలుగురు దుండగులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, గన్‌తో బెదిరించి అతడి ఫోన్ మరియు వాలెట్‌ను ఎత్తుకెళ్లారు.

Also Read: Kumari Aunty: స్టార్‌మా షోకు స్పెష‌ల్ గెస్ట్‌గా ‘కుమారి ఆంటీ’.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు నాన్ వెజ్ వంటలు!

తనపై జరిగిన దాడిని సయ్యద్‌ మజాహిర్‌ అలీ వీడియో ద్వారా వెల్లడించాడు. చికాగోలోని కాంప్‌బెల్‌లో ఇంటి వద్ద అతణ్ని దుండగులు వెంబడించిన సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తమకు సాయం చేయాలని మజాహిర్‌ అలీ కుటుంబ సభ్యులు ప్రధానిని కోరారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న అలీ భార్య అమెరికా వెళ్లేందుకు సహాయం కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను సంప్రదించారు.

Show comments