NTV Telugu Site icon

Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ

Vanasthalipuram Ps

Vanasthalipuram Ps

Robbery : హైదరాబాద్ నగరంలో దారి దోపిడీలు వణుకు పుట్టిస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసి దోపిడీ దొంగలు రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురంకు చెందిన వెంకట్రామి రెడ్డి అక్కడే ఓ రెండు వైన్స్‌లు, ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి బార్ మూసేసిన తర్వాత వచ్చిన కలెక్షన్ రూ.2కోట్లను బ్యాగులో పెట్టుకొని ఇంటికి బయల్దేరారు. వెంకట్రామిరెడ్డి, మరో వ్యక్తి కలిసి వెళ్తున్న బైకును దుండగులు అడ్డగించారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి.

Read Also: Big Breaking: కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు

వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.1.75 కోట్లను దోచుకుపోయారు. బాధితుడు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.కింద పడిన డబ్బును తీసుకుని వనస్థలిపురం పోలీసు స్టేషన కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంకట్రామిరెడ్డి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా పోలీసులు దోపిడీ జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. న‌గ‌దు దొంగిలించిన నిందితుల కోసం గాలింపు చ‌ర్యలు చేపడుతున్నారు. వ‌న‌స్థలిపురం చౌర‌స్తాలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

Read Also:Mobile Phone Exploded: మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్..

Show comments