Site icon NTV Telugu

Hyderabad Roads: హైద‌రాబాద్ రోడ్లపై వర‌ద నీటిలో కూర్చుని మ‌హిళ నిర‌స‌న‌..

A Woman

A Woman

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. హైదరాబాద్‌లో రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వరద నీరు మిగిలిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెరైటీగా నిరసన తెలిపింది. రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని వినూత్న రీతిలో ఆమె నిరసన తెలిపారు.

Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా?

నాగోలు – బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. కొత్త రోడ్డును నిర్మించాలని ఆమె కోరారు. ట్రాఫిక్ పోలీసులు ఆమెను ట్రాఫిక్ పోలీసులు న‌చ్చ‌జెప్పినా ఆమె వినలేదు. రోడ్డును పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని ఆమెను కదలకుండా అలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

No Vacancy: దేవుడా.. ఐఐటీ స్టుడెంట్స్ కు కూడా ప్లేస్ మెంట్స్ కరువాయే.. వేలాది స్టూడెంట్స్ ఎదురుచూపులు..

ఇక ఈ ఘటనకు సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

Exit mobile version