Bigg Boss Mehaboob: హైదరాబాద్‌లో రేవ్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అరెస్ట్?
- హైదరాబాద్‌లో రేవ్ పార్టీ
- మహబూబ్ షేక్ బర్త్ డే పార్టీ
- పార్టీలో పలువురు సెలబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Fame Mehaboob Shaikh Arrested: హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ మరోసారి కలకలం రేపింది. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినందుకు మహబూబ్ సహా పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29న ఈ ఘటన జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూలై 29న బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్ డే. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్‌లోని కాంటినెంట్ రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌కు మహబూబ్ ఫ్రెండ్స్ చాలా మంది హాజరయ్యారు. అందరికోసం గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. రిసార్ట్‌లో లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై పార్టీ ఆర్గనైజర్ సుభాన్ అలీ, రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. మహబూబ్‌పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
Also Read: Gold Price Today: సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే తులంపై రూ.870 పెరిగింది!
పార్టీలో 11.2 లీటర్ల మద్యం, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. 750 ఎంఎల్ మూడు బాలంటైన్స్ విస్కీ బాటిల్స్, ఐదు అబ్సోలట్ సిట్రాన్ వోడ్కా బాటిల్స్, ఒక లీటర్ బ్లాక్ లేబుల్ విస్కీ , 11 బడ్వైజర్ బీర్ బాటిల్స్, 19 బ్రీజర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఇంకేమైనా నిషేధించిన ద్రవ్యాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ పార్టీలో గీతూ రాయల్, శ్రీ సత్య, ఢీ ఫేం శ్వేత, యాంకర్ ధనుష్, సావిత్రి భర్త గంగూలీ, దివ్య శ్రీతో పాటు పలువురు ఉన్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!