హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గత వారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే.. ఈ రోజు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో రోడ్లపైకి వర్షపు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైటెక్ సిటీ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచాయి. చార్మినార్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో గోల్నాక బ్రిడ్జి పై నుండి వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఉప్పల్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, బాలానగర్, ప్రకాశ్ నగర్, ట్యాంక్ బండ్, ఐకియా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
Also Read : Tamota Price Effect : మెక్ డొనాల్డ్స్ దారిలోనే సబ్‌వే.. మెనూలో టమోటా అవుట్..
సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, అంబర్ పేటలలో 4 సెంటీమీటర్లు, గోషా మహల్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే.. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ సోమవారం తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జూలై 25-27 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : KTR Birthday: మంత్రి కేటీఆర్ బర్త్‌డే స్పెషల్.. విద్యార్థినులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేసిన శ్రీ గణేష్
