Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!
- ఐటీ హబ్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం..
- Quack Arena Pub పై ‘ఈగల్ టీం’ ఆకస్మిక దాడులు
- వీకెండ్ ఈవెంట్ “DJ Black Coffee” సమయంలో రైడ్స్ నిర్వహణ
- పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం
- స్పాట్‌లోనే డ్రగ్స్ టెస్టింగ్
- 8 మందికి పాజిటివ్
- నిందితులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pub Drug Raid: హైదరాబాద్ నగరంలోని ఐటీ హబ్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేపాయి. కొండాపూర్ లోని ప్రముఖ పబ్ ‘క్వాక్ ఎరీనా’ (Quack Arena) పై ఏసీబీ ఈగల్ టీం శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించింది. వీకెండ్ కావడంతో పబ్ నిర్వాహకులు ‘డిజే బ్లాక్ కాఫీ’ పేరిట భారీ ఈవెంట్‌ను నిర్వహించగా, అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ రైడ్స్ చేపట్టారు.
కొండాపూర్ లోని క్వాక్ ఎరీనా పబ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. కేవలం రెండు నెలల క్రితమే ఇక్కడ నిర్వహించిన మరో భారీ పార్టీపై ఈగల్ టీం దాడులు చేసింది. ఆ సమయంలో ఏకంగా 15 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మళ్ళీ అదే పబ్ లో డ్రగ్స్ దందా బయటపడడం గమనార్హం.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
నిన్న రాత్రి జరిగిన ఈవెంట్ కోసం నిర్వాహకులు ఆన్లైన్ లో భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. భారీ ఎత్తున యువతీ యువకులు హాజరైన ఈ వేడుకలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని ఈగల్ టీం పక్కా సమాచారంతో రంగంలోకి దిగింది. ఈ దాడులలో ఈగల్ టీం తమ వెంట తెచ్చుకున్న ప్రత్యేక ఎక్విప్మెంట్స్ ద్వారా పబ్ లో ఉన్న వారికి అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఎనిమిది మంది డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ ఘటనతో పబ్ యాజమాన్యానికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరు పబ్ లోపలే డ్రగ్స్ సరఫరా చేశారా లేక నిందితులు బయట నుంచి తెచ్చుకున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడుల సమయంలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా అదే పబ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. “నేను ఈ రోజు క్వాక్ ఎరీనా పబ్ కి వెళ్ళాను. పోలీసులు అక్కడ నాకు యూరిన్ టెస్ట్ నిర్వహించారు. ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది. హేమ ఎప్పుడూ తప్పు చేయదు, జెన్యూన్ గా ఉంటుంది” అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈవెంట్ లో పాల్గొన్నప్పటికీ తనకు డ్రగ్స్ తో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!
వరుసగా రెండోసారి ఒకే పబ్ లో డ్రగ్స్ కేసులు బయటపడడంతో పోలీసులు క్వాక్ ఎరీనా పబ్ లైసెన్స్ రద్దు చేసే దిశగా ఆలోచిస్తున్నారు అధికారులు. పట్టుబడిన ఎనిమిది మంది యువకులు ఎక్కడి నుండి వచ్చారు? వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? అనే అంశాలపై గచ్చిబౌలి పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఐటీ కారిడార్ లో పబ్ లపై నిఘా మరింత పెంచుతామని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!