Site icon NTV Telugu

Hyderabad: అదనపు మెజిస్ట్రేట్గా మారిన సీపీ..

Cp Cv Anand

Cp Cv Anand

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అదనపు మెజిస్ట్రేట్గా మారారు. అదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించారు. హిమాయత్ నగర్‌లో జరిగిన ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వివాదాన్ని విచారించారు. హుమాయూన్ నగర్‌లో ఎమ్మెల్యే మాజీద్, ఫిరోజ్ ఖాన్ మధ్య వివాదం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలో.. అదనపు మెజిస్ట్రేట్ ఎదుట మాజీద్ ఖాన్, ఫిరోజ్ హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీపీ సీవీ ఆనంద్.. గొడవల వల్ల సమాజానికి చేటు జరుగుతుందని అన్నారు. ఇద్దరు కూడా సంయమనం పాటించాలని సీపీ ఆనంద్ సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరుపక్షాల వాదనలు విని కేసుని వాయిదా వేశారు సీపీ ఆనంద్.

Exit mobile version