NTV Telugu Site icon

Hyderabad : హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు..

Fake Currency

Fake Currency

నకిలీ నోట్ల దందాకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా.. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని నిందితులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ భారీ ఫేక్ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్‌ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నాట్లు శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Also Read : DK Shivakumar: “సోనియా గాంధీ మాటిచ్చినట్లే”.. డీకే శివకుమార్ కన్నీరు..

ఈ ముఠా ఫేక్ కరెన్సీ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 50, 100, 200, 500 నోట్లు ప్రింట్ చేసినట్లు పేర్కొన్నారు. రూరల్ ప్రాంతాలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేశారు. రాత్రి వేళల్లో రద్దీగా ఉండే షాపుల్లో కూడా నోట్లను మార్చినట్లు పోలీసులు చెప్పారు. ఇక ప్రింట్‌ చేసిన దొంగ నోట్లను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ముఠా తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : Karnataka Results: గ్రాండ్‌ విక్టరీ కొట్టిన కాంగ్రెస్‌.. సీఎం అయ్యేదెవరు..?

ఇదిలా ఉంటే ఈ ముఠా నకిలీ నోట్ల ముద్రణ అచ్చంగా ఫర్జీ వెబ్‌ స్టోరీలాగే ఉంది. బాలీవుడ్ లో ఇటీవలై విడుదలైన ఫర్జీ వెబ్‌ సిరీస్‌లో షాహీద్‌ కపూర్‌ నకిలీ నోట్లను తయారు చేసే పాత్రలో కనిపిస్తారు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ముఠా కూడా ఇలాగే దొంగ నోట్లను ముద్రించిన్నట్లు పోలీసులు తెలిపారు. నోట్ల తయారీ కోసం స్థానికంగా దొరికే కలర్స్, బాండ్ పేపర్, ప్రింటర్లు వాడినట్లు చెప్పుకొచ్చారు.

Also Read : IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నోట్లను ముద్రించి.. శంషాబాద్ దగ్గర తొండుపల్లిలోని 5 స్టార్ గ్రాండ్ హోటల్ కేంద్రంగా ఏజెంట్లకు సర్క్యులేట్ చేస్తున్నాట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ కేంద్రంగా నోట్లు తయారు చేసేందుకు వచ్చిన ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రంజిత్‌ సింగ్‌కు ప్రింటింగ్‌ ప్రెస్‌లో.. అలాగే డీటీపీ ఆపరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నాలెడ్జ్‌ తోనే ఈ దొంగ నోట్ల దందాకు తెర తీశాడు.

Show comments