Site icon NTV Telugu

Road Accident: ORRపై కారు బీభత్సం.. పలువురికి గాయాలు!

Accident

Accident

Road Accident: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెళుతున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టుకుంటూ అవతలి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆ కారుతో పాటు మరో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. విమానాశ్రయం వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఒక కారు చెన్నమ్మ హోటల్ సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో కారు స్కిడ్ అయి, డివైడర్‌ను ఢీకొట్టింది. పల్టీలు కొట్టుకుంటూ అవతలి వైపు (గచ్చిబౌలి – ఎయిర్‌పోర్ట్ రోడ్డు) దూసుకొచ్చిన కారు, అక్కడ వెళుతున్న మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది.

Saipalavi : సాయి పల్లవి బికిని ఫోటోలు నిజమేనా?

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ORRపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన కార్లను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Madyapradesh: ఘోర ప్రమాదం.. ఇండోర్ లో భవనం కూలి ఇద్దరు సజీవ సమాధి

Exit mobile version