Site icon NTV Telugu

Hyderabad: నాంపల్లి అగ్ని ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న యువకుడి చివరి కాల్ రికార్డింగ్

Nampally Bachas Furniture Fire

Nampally Bachas Furniture Fire

Hyderabad: హైదరాబాద్‌ నాంపల్లిలో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఇటీవల చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుకాణంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యాదయ్య, లక్ష్మి దంపతుల కుమారులు అఖిల్, ప్రణీత్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళిన సేల్స్‌మ్యాన్ మహ్మద్ ఇంతియాజ్, ఆటో డ్రైవర్ సయ్యద్ హబీబ్, మరో మహిళ బేబీ సైతం మృత్యువాత పడ్డారు. వాస్తవానికి ఆ ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్ ఒక మృత్యు కుహరాన్ని తలపించింది. అయితే.. తాజాగా ఇంతియాజ్‌కి సంబంధించిన లాస్ట్ కాల్ రికార్డు బయటకు వచ్చింది. చనిపోయే కొద్దిక్షణాల ముందు సేల్స్‌మ్యాన్ ఇంతియాజ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. “ఫైర్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పాడింది అన్న.. ఎగ్జిట్ రూట్‌లు అన్నీ మూసుకుపోయాయి.. నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు.. బయటకు రాలేకపోతున్నాం.. అన్న కాపాడండి.. అసలేం కనిపించడం లేదు..” అని ఆర్తనాదాలు చేశాడు. యువకుడి చివరి కాల్ రికార్డింగ్ కన్నీరు పెట్టిస్తోంది.

READ MORE: Pakistan PM: పరువు తీసుకోవడమే పాక్ ప్రధాని పని.. ఈసారి ఏం చేశాడంటే..

Exit mobile version