Site icon NTV Telugu

Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ లో నిన్ని సాయంత్రం మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ లో మెట్రోలు నిలిచి పోవడంతో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణిలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఒక వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ దీంతో మెట్రోలో ప్రయాణించాలి అనుకున్న వారికి గట్టి షాక్ తగిలింది. నిన్న సాయంత్రం సాంకేతిక లోపంతో ఎక్కడి కక్కడే మెట్రో రైల్లు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో వున్న ప్రయాణికులు భాయాందోళనకు గురయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు నరకయాతన అనుభవించారు. మెట్రోలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో డోర్లు తెరుచుకోలేదు దీంతో ప్రయాణికులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు రైళ్లు ఆగడంతో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్ మెట్రోలో ఎగ్జిట్ మిషన్లు కూడా పనిచేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో మెట్రో రైల్ నిలిచిపోవడంతో.. మెట్రో డోర్లు తెరుచుకోలేదని, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రయాణికులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

Read also: Astrology: జూన్ 06, గురువారం దినఫలాలు

ఈ ప్రభావం ఇతర మెట్రో సర్వీసులపై పడింది. మియాపూర్ టు ఎల్బీనగర్ రూట్ లో మెట్రో సర్వీసులు స్లో గా నడిచాయి. అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించినట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. చిన్నపాటి పొరపాటు వల్లే రైళ్లు నిలిచిపోయాయని వెల్లడించారు. 7 నిమిషాల్లో సమస్య పరిష్కారమైంది. అనంతరం దాదాపు 10 నిమిషాల తర్వాత తిరిగి మెట్రో ప్రారంభమైంది. ఈ మేరకు ఎక్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మేము చిన్న అంతరాయాన్ని త్వరగా పరిష్కరించాము. ఈ సాయంత్రం హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు కొద్దిగా అంతరాయం కలిగింది. MGBS వద్ద ట్రాన్స్ కో ఫీడర్ ట్రిప్ అవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. మా బృందం ఈ సమస్యను 7 నిమిషాల్లో పరిష్కరించాము. మేము దానిని మియాపూర్‌లోని మరొక ఫీడర్‌కు కనెక్ట్ చేసామని తెలిపారు. మెట్రో రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయరి పేర్కొన్నారు.
Uttarakhand: హిమాలయాల్లో విషాదం.. ట్రెక్కింగ్‌ చేస్తూ 9 మంది మృతి

Exit mobile version