Site icon NTV Telugu

Hyderabad Metro : మరో 45 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు

Metro

Metro

నాంపల్లి లో ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం అయిన నుమాయిష్ నాంపల్లిలో ఆలిండియా ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు, స్టాల్స్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నుమాయిష్‌ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. అయితే.. 45 రోజుల పాటు జరిగి ఈ ఎగ్జిబిషన్‌నుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాపారాల ఏర్పాటు కోసం దాదాపు 1400 స్టాల్స్‌ను కేటాయించారు. రెడీమేడ్ డ్రెస్‌లు, ఇంటి అలంకరణ సామగ్రి, బొమ్మలు, ప్లాస్టిక్ వేర్, హస్తకళలు, సౌందర్య సాధనాలు మరియు ఎలక్ట్రానిక్స్‌తో కూడిన దుకాణాలు వచ్చాయి. అయితే ఇప్పటికే నగర ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 15 వరకు సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ వైపు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Also Read : Uttamkumar Reddy : ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. సర్పంచులకు వెంటనే నిధులను విడుదల చేయాలి

ప్రజలు నుమాయిస్‌కు తరలివచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఇదే విధంగా.. నాంపల్లి నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళ మెట్రో సేవలను మరో గంట పొడిగించింది. అర్ధరాత్రి 12 వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం, నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి రైలు బయలుదేరుతుంది. అయితే.. ఇటీవల న్యూయర్‌ వేడుకల్లో సైతం మెట్రో సర్వీసులు అర్థరాత్రి వరకు నడిపించారు అధికారులు. ఇప్పుడు నుమాయిష్‌ సందర్భంగా మరో45 రోజుల పాటు అర్థరాత్రి వరకు మెట్రోసేవలు హైదరాబాదీలకు అందుబాటులో ఉండునున్నాయి.
Also Read : Boost Immunity With Mint : పుదీనాతో రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం

Exit mobile version