CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. మెట్రో ఫేజ్–2 అనుమతుల కోసం ఢిల్లీకి బయల్దేరారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి కలుసుకుంటారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు త్వరగా ఆమోదం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఫేజ్–2లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. ఫేజ్–2లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 నెట్వర్క్ 69.2 కిలోమీటర్లు, ఫేజ్–2 పూర్తయితే హైదరాబాద్ మెట్రో మొత్తం నెట్వర్క్ 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. హైదరాబాద్ నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫేజ్–2 విస్తరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది.
ఇదిలా ఉండగా.. మెట్రోరైలు రెండో దశకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్‌లో వందశాతం షేర్ల కొనుగోలుతో ప్రాజెక్ట్‌ను గత నెల 30న ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలుపుతూ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు.. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవడంతో ఇప్పటివరకు కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు తొలగిపోయాయని తెలిపారు. ఇకనైనా రెండోదశ ఎ, బి భాగంలోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లను ఆమోదించాలని లేఖలో కోరారు.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!