NTV Telugu Site icon

Hyderabad : వామ్మో.. ఏందయ్యా ఇది.. మెట్రో నిండా మగవాళ్లే..

Metro Stations

Metro Stations

తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఆర్టీసీలో ఉచితం చేసింది.. దాంతో మహిళా ప్రయాణికులు అంతా బస్సులకు వెళ్తున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది.. ఎక్కువ మంది లేటు అయినా పర్లేదు అలానే వెళ్తామంటున్నారు.. రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.

అయితే మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు మహిళలు ఆర్టీసీ ప్రీ ప్రయాణాన్ని వాడుకుంటున్నారు.. హైదరాబాద్ లో బాగా ప్రాచుర్యం పొందిన మెట్రో ఇప్పుడు మగవాళ్ళతో నిండిపోతుంది.. ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావం కనిపిస్తోంది. నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ లో మాత్రం మెట్రో లు ఫుల్ అవుతున్నాయి.. మొత్తం మహిళలు అంతా ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు..

సాధారణంగా ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ రాకముందు 5 లక్షల వరకు మెట్రో రైడర్ షిప్ నమోదయ్యేది. అయితే, ఆర్టీసీలో మహిళలకు ఉచితం ఇవ్వడంతో కొంత వుమెన్ క్రౌడ్ మెట్రో కంటే ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపు 12 వందల నుండి 15 వందల వకు సేవ్ అవుతుందంటున్నారు. మరికొందరు మెట్రో స్టేషన్స్ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వినియోగించుకుంటూనే, రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా మెట్రోలో ప్రయాణిస్తున్నారు.. ఇప్పుడు లేడీస్ ఎక్కువగా లేకపోవడంతో సీట్లు కూడా దొరుకుతున్నాయని మగవాళ్ళు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు..