NTV Telugu Site icon

Hyderabad: మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..

Hyd Fire

Hyd Fire

హైదరాబాద్లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది వివరాలు తెలియాల్సి ఉంది.