Site icon NTV Telugu

Terror Attack: ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న హైదరాబాదీ అరెస్ట్..!

Terror

Terror

Terror Attack: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నుతున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ముఠా దేశంలో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరిని గుజరాత్ రాష్ట్రంలోని ఒక టోల్ ప్లాజా సమీపంలో ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్ పట్టుకున్న ఈ ముగ్గురిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (Syed Ahmed Mohiuddin) ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అరెస్ట్ అయిన మిగతా ఇద్దరు వ్యక్తులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫ్ గా అధికారులు గుర్తించారు.

Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురూ గత ఏడాది కాలంగా ఏటీఎస్ నిఘాలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నుతూ, అందుకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఉండగా వారిని అరెస్టు చేసినట్లు ఏటీఎస్ పేర్కొంది. పట్టుబడిన వ్యక్తులపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దేశంలో దాడులకు వారి ప్రణాళికలు, ఈ కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై ఏటీఎస్ దృష్టి సారించింది.

Terrorist: చైనాలో MBBS చదివి.. రసాయన విషంతో భారత్ లో విధ్వంసానికి ప్లాన్.. అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

Exit mobile version