Hyderabad: హైకోర్టులో లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ పేలుళ్ల కేసు విచారణకు వచ్చింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని నేరస్థులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై హైకోర్టు ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. కేసు విచారణను మరో బెంచ్‌కు మార్చాలన్న నేరస్థుల లాయర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది.
READ MORE: ప్రీ-బుకింగ్స్లో సంచలనం.. Mahindra XUV 7XOకి ఎందుకింత క్రేజ్..
కాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి గతంలో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది మరణాలకు కారణమైన ఉగ్రవాదులు అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో దోషి తారీఖ్ అంజూమ్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లైంది. దీంతో బాధితుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
READ MORE: Car On Railway Track: ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పైకి మహీంద్రా థార్ .. కారు నడిపిన 65 ఏళ్ల వృద్ధుడు
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో అనీక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌ను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. మరో నిందితుడు తారీఖ్ అంజూమ్‌ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. వీరంతా నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి తారీఖ్ ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చినట్లు విచారణలో రుజువైంది. వీరందరిపై దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తదితర కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు ఈ మేరకు మరణ శిక్ష విధించింది.
