Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..

  • దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు..
  • లంచం డిమాండ్ చేసిన ఎస్సైలు అరెస్ట్..
  • పోలీస్ స్టేషన్‌లో కీలక పత్రాలు స్వాధీనం..
Acb

Acb

హైదరాబాద్‌ ఎల్బీనగర్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి నిందితుడికి నోటీసులు ఇచ్చేందుకు.. అతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ (Freeze) కాకుండా చూసేందుకు ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారు.

Also Read:Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు..

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. బాధితుడి నుంచి లక్ష రూపాయల నగదును తీసుకుంటుండగా ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ అనే ఇద్దరు ఎస్ఐలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Also Read:Branded Shoes: ఆ షాపులో కేవలం రూ.1 కే బ్రాండెడ్ షూ.. ఎగబడ్డ జనం..

నిందితుల చేతులకు జరిపిన కెమికల్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. వారు లంచం తీసుకున్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. అరెస్ట్ అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బృందం సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.