హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ మండలం కోహెడలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోహెడలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు, అక్కడే ఉన్న ఒక ఫామ్‌హౌస్ యాజమాన్యానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదం హింసాత్మక రూపం దాల్చింది. వివరాల ప్రకారం, కోర్టు ఆదేశాల మేరకు తమ ప్లాట్లను శుభ్రం చేసుకుంటున్న యజమానులను ఫామ్‌హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. అనంతరం ఫామ్‌హౌస్ వర్గీయులు ప్లాట్ల యజమానులపై రాళ్లు , గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్లాట్ల యజమానులు తీవ్రంగా గాయపడ్డారు.
Union Bank Recruitment 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. యూనియన్ బ్యాంక్ లో 500 మేనేజర్ జాబ్స్ రెడీ..
ఈ వివాదానికి సంబంధించి గతంలోనూ ఇదే కోహెడ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తుల ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ ఫామ్‌హౌజ్ నిర్మించాడని బాధితులు హైదరాబాద్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ (హైడ్రా)కి ఫిర్యాదు చేశారు. హైడ్రా స్పందించి భారీ బందోబస్తు మధ్య సదరు ఫామ్‌హౌజ్‌ను కూల్చివేసింది. కబ్జాదారుల నుండి తమకు న్యాయం జరిగిందని అప్పట్లో ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.
BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాల స్వాధీనం
అయితే, తాజాగా జరిగిన దాడితో భూ వివాదం ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టమవుతోంది. గతంలో హైడ్రా చర్యలు తీసుకున్నప్పటికీ, ఫామ్‌హౌస్ యాజమాన్యం ప్లాట్ల యజమానులను వేధిస్తూనే ఉందని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా దాడికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ సంఘటన కోహెడ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
