Hyderabad Kite Festival: సంక్రాంతి సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. రేపటి (జనవరి 13) నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరవాసులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్‌కు రానున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Sandeep: రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే ర్యాంపే.. కొరియోగ్రాఫర్ సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఈ ఏడాది ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిలవనుంది. జనవరి 16, 17, 18 తేదీలలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ నిర్వహించనుండగా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆకాశంలో ఎగిరే బెలూన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. మరోవైపు ఆధునిక టెక్నాలజీకి వేదికగా డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. జనవరి 16, 17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్ట్ జరగనుంది. వినూత్న డ్రోన్ షోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్‌ను పూర్తిగా ఉచితంగా నగరవాసులు, పర్యాటకులు ఆస్వాదించవచ్చు. రంగులు, రుచులు, టెక్నాలజీ మేళవించిన ఈ హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి వేడుకలకు మరింత అబ్బురపరచనుంది.
