NTV Telugu Site icon

Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన కూరగాయల ధరలు.. సామాన్యుల జేబులకు చిల్లే..

Vegg

Vegg

మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు..

గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్ ధరలు వందకు పడిపోయాయి.. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి.. ప్రస్తుతం బీన్స్ ధరలు రూ. 50 ఉండగా, చిక్కుడు కాయల ధరలు మాత్రం రూ. 65 దగ్గర ఉన్నాయి.. అదే విధంగా దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది..

అంతేకాదు ఉల్లి, వెల్లుల్లితో పాటుగా అల్లం, ఆకుకూరల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.. హోల్‌సేల్‌ లో కిలో వెల్లుల్లిపై ధర 240 పలుకుతోంది ఇక పావు కిలో అల్లం ధర 40 రూపాయలు ఉండగా కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది అంటూ వ్యాపారాలు చెప్తున్నారు.. మొన్న కురిసిన వర్షాలకు పంట లేకపోవడం.. నాణ్యత లేకపోవడం, కొత్త పంట రాకపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.. కాయ కష్టం చేసుకొని నోటికి రుచిగా తినడానికి లేకుండా పోయింది సామాన్యులకు..