Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సార్ నగర్ లో 11 సెంటీమీటర్లు, సరూర్నగర్ లో 10, ఖైరతాబాద్ లో 11 సెంటీమీటర్లు వర్షం కురిసింది. నిమ్స్ ఆస్పత్రి వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా వరద నీరు నిలిచింది. పంజాగుట్ట ఖైరతాబాద్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం హుడా మయూరిలో భారీ వర్షానికి రోడ్లు నీట మునిగాయి. రోడ్డుపై నీటిలో కారు ఆగిపోయింది. కారు అద్దాలు పగులగొట్టుకొని ప్రయాణికులు బయటకు వచ్చారు. మరోవైపు.. మలక్‌పేట్, దిల్సుఖ్‌నగర్, చైతన్యపురి వరకు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మలక్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీగా చేరిన వరుద నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవరసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని.. తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
