Site icon NTV Telugu

Fake Liquor: బయట బ్రాండెడ్‌ లోగో.. లోపల మాత్రం కల్తీ మద్యం..

Fake Liquor

Fake Liquor

Hyderabad Fake Liquor: హైదరాబాద్‌లోని కుషాయిగూడ‌లో అక్రమంగా మ‌ద్యం లేబ‌ల్స్ త‌యారీ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. క‌ల్తీ లిక్కర్ త‌యారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ మద్యానికి లేబుల్స్ వేసి అసలైన మద్యంగా అమ్ముతున్నట్టు గుర్తించారు. హుజూర్నగర్ నకిలీ మద్యం కేసులో నవీన్ అనే వ్యక్తికి ఈ ముఠా సహకరిస్తుంది. కుషాయిగూడ చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ యజమాని నవీన్ అరెస్ట్‌ చేశారు. నిందితుల‌ను ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించి వేల సంఖ్యలో నకిలీ మద్యం లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో Ac Black whisky, No.1 Mc Whisky, Old Admiral Brandy, Kerala Malt whisky, Royal stag whisky ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ప్రీమియం బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. నకిలీ ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని తక్కువ రేట్లకే అమ్ముతున్నారు. హుజూర్‌న‌గ‌ర్‌లో దొరికిన న‌కిలీ మ‌ద్యంపై పోలీసుల విచార‌ణ చేపట్టారు..

READ MORE: Sri Chaitanya Hostel Ragging: శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్‌లో ర్యాగింగ్ .. ఐరన్ బాక్స్‌తో వాతలు

Exit mobile version