Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏకంగా రూ.72 కోట్లు..!

Drug Rocket

Drug Rocket

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా.. బొల్లారంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌పై దాడి చేసి.. ఫ్లాట్ నుంచి 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కింగ్ పిన్ శివ రామకృష్ణ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబు అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన ఎం. ప్రసాద్ పరారీలో ఉన్నాడు. డ్రగ్ తయారీ కేంద్రం ఐడీఏ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో తయారు చేశారు. ఏపీడ్రిన్‌ను మెథాంఫెటమైన్‌గా మార్చి మార్కెట్ లో 10 రెట్లు ధర అమ్ముతున్నట్లు ఈగల్ టీం గుర్తించింది.

READ MORE: Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కొనసాగుతున్న సునామీ హెచ్చరికలు..

ఈ ముఠా ఈజీ మనీ కోసం డ్రగ్ తయారీ చేస్తోంది. ప్రధాన నిందితుడు శివరామకృష్ణకు గతంలో ఓ కెమికల్ కంపెనీల్లో కెమిస్టుగా అనుభవం ఉంది. ఉద్యోగం మానేసి ఆక్వా బిజినెస్ చేస్తూ డ్రగ్ తయారు చేస్తున్నాడు. ఈ ముఠా 2024 డిసెంబర్‌లో ఏపీడ్రిన్ తయారీ మొదలు పెట్టింది. పీఎన్ఎం లైఫ్ సైన్సెస్ యూనిట్‌లో 220 కిలోల ఎఫెడ్రిన్ తయారు చేసింది. తయారైన డ్రగ్‌ను జీడిమెట్ల సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 101లో దాచి పెట్టింది. ఫ్లాట్‌లో నలుగురు ఉంటున్నట్లు ఈగల్ టీంకి సమాచారం అందింది. డ్రగ్ విక్రయానికి సిద్ధమవుతుండగా వల వేసి పట్టుకుంది ఈగల్ టీం.

READ MORE: Mirai : ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ

Exit mobile version