Site icon NTV Telugu

Hyderabad: ఈ సారూ వైద్యుడు మాత్రమే కాదు.. పెద్ద డ్రగ్‌ డీలర్.. డాక్టర్‌ ఇంట్లో డ్రగ్స్ డెన్..

Drugs

Drugs

Hyderabad Drug Bust: ముషీరాబాద్‌లో డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్ బయటపడింది.. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్‌ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు.. ముగ్గురు మిత్రులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు డాక్టర్ జాన్ పాల్.. ఢిల్లీ బెంగళూరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నాడు. ప్రమోద్, సందీప్, శరత్ స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ను తెప్పించుకున్నాడు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు చేయగా ఓజి కుష్, ఎండిఎంఎ, ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు డాక్టర్ జాన్ పాల్ అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు..

READ MORE: Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

మరోవైపు.. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకున్న ఒక నైజీరియన్ పౌరుడు కూడా అరెస్టయ్యాడు. డ్రగ్స్ పార్టీలపై ఇప్పటికే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పలు కేసులు నమోదవుతున్న వేళ, మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పోలీసులను అప్రమత్తం చేసింది. గచ్చిబౌలిలోని లగ్జరీ గెస్ట్ హౌస్‌లలో జరుగుతున్న పార్టీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి పార్టీలకు హాజరయ్యే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

 

Exit mobile version