Hyderabad Crime: ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై డాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఓ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసిన యువకుడు స్థానికులను, పోలీసులను షాక్కు గురిచేశాడు. ఈ హృదయ విదారక ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడలో ఒంటరిగా జీవిస్తున్న కమలాదేవి అనే వృద్ధురాలు తనకు చెందిన షాపులో ఓ యువకుడికి అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. అద్దె విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కమలాదేవి ఆ యువకుణ్ణి మందలించినట్టు తెలుస్తోంది. కమలాదేవిపై కోపంగా ఉన్న యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీన ఈ యువకుడు కమలాదేవిని ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన అనంతరం కమలాదేవి మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసిన అతడు, ఆ వీడియోలను తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు సమాచారం పొందారు. దీంతో పోలీసులు కమలాదేవి ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
మృతురాలి హత్యలో నిందితుడిగా భావిస్తున్న యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించి, నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..