RS 11 Crore Cash Seized in Kubera Movie Style in Hyderabad: ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగితే.. హైదరాబాదులో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. అచ్చం ‘కుబేర’ సినిమా తరహాలో ఫామ్‌హౌస్‌లో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కుబేర సినిమా స్టైల్‌లోనే బియ్యం బస్తాలు, అల్మారాలో డబ్బులు దాచి పెట్టారు. ఏకంగా 11 కోట్ల రూపాయలను సర్దేసి పెట్టారు. ఎవరో వస్తారు.. కీ చెప్తారు.. డబ్బులు పెడతారు.. తీసుకొని వెళ్తారు. ఇది ఫామ్‌హౌస్‌లో జరిగిన తతంగం. హైదరాబాదులోని వర్ధమాన్ కాలేజీ కి సంబంధించిన ఫామ్‌హౌస్‌లో ఈ డబ్బు దొరికింది.
తెల్లవారుజామున సిట్ అధికారులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసి నగదు మొత్తాన్ని తీసుకొని పోయారు. 11 కోట్ల రూపాయల నగదు వ్యవహారం సంబంధించి సిట్ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ కూడా పూర్తిస్థాయిలో వివరాలు కావాలని సిట్‌ను కోరింది. ఏపీ లిక్కర్ స్కాం సంబంధించిన డబ్బుగా అధికారులు గుర్తించారు. అయితే ముందస్తుగా రాజ్ కసిరెడ్డి నగదుగా సిట్ అధికారులు అనుమానించారు. చివరకు ఆ డబ్బు రాజు కసిరెడ్డిది కాదని తేల్చివేశారు. వర్ధమాన్ కాలేజీల సంబంధించి విజయేందర్ రెడ్డికి సంబంధించిన తల్లి సులోచన ఫామ్‌హౌస్‌లో ఈ డబ్బులు లభ్యమైనది. ఈ డబ్బు మొత్తం కూడా వాళ్ళదేనని, తనది కాదని కేసిరెడ్డి కోర్టులో ఆపిడిఫిట్ దాఖలు చేశారు. విజయేందర్ రెడ్డికి ఆసుపత్రులతో పాటు కాలేజీలు సహా పలు వ్యాపారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోని డబ్బు మొత్తం వాళ్ళదే అని చెప్పారు.
లిక్కర్ స్కామ్ కేసులో ప్రతిరోజూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు దాదాపు అరవై కోట్ల రూపాయలను సీజ్ చేశారు. మొత్తం మద్యం స్కామ్ విలువ 3,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో దొరికిన నోట్ల కట్టలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వేకొద్దీ అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని భావించి కూటమి ప్రభుత్వం రాగానే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. గత ఏడాది నుంచి ఈ స్కామ్ కు సంబంధించిన విచారణ జరుగుతుంది. ఈ కేసులో కీలకనిందితుడైన రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ తర్వాత అనేక మంది అరెస్టయ్యారు. నిందితులందరూ దుబాయ్ లోని ఒక గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నారని సిట్ విచారణలో వెల్లడయింది.
Also Read: WCL 2025: డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ అవుట్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్థాన్!
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డితో పాటు అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ పలు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. విచారణలో పేర్కొన్న అంశాల మేరకు సిట్ అధికారులు తాజాగా హైదరాబాద్ లో అనేక చోట్ల సోదాలు నిర్వహించారు. భారతి సిమెంట్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. గోవిందప్ప నిందితుడిగా ఉండటంతో భారతి సిమెంట్స్ లో సోదాలు జరిగాయి. తాజాగా 11 కోట్లను శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్‌హౌస్‌లో డబ్బును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడి చేసి పన్నెండు పెట్టెల్లో దాచిన పదకొండు రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచినట్టు వరుణ్, చాణక్యలు అంగీకరించారు. 2024 జూన్‌లో డబ్బు దాచినట్టు గుర్తించిన సిట్ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ సొమ్మును సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేర్లపై ఫామ్‌హౌస్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికీ ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
