Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!

Murder

Murder

Hyderabad: రోజురోజుకి సమాజంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి. హైదరాబాద్‌లోని బోరబండ శిల్పినగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. నవంబర్ 1 (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యాసాగర్‌ (36) అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్ పనికి వెళ్లింది. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమారుడు అప్పటికే మృతి చెంది ఉన్నాడు.

దీంతో ఆమె పొరుగువారికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే నిందితుడు పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.