Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్ డైలాగ్ ను వాడేసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు..ఎలానో తెలుసా..?

Whatsapp Image 2023 12 31 At 2.52.05 Pm

Whatsapp Image 2023 12 31 At 2.52.05 Pm

నేడు డిసెంబర్ 31 ఈ అర్ధ రాత్రికి ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాం. ఈ న్యూ ఇయర్ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఈ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై ప్రవహిస్తుంది.ఈ తెలుగు రాష్ట్రాల్లో మంచి మందు దావత్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పే మందుబాబులు ఎంతోమంది వుంటారు.ఈ నేపథ్యం లో మందు బాబులకు హైదరబాద్ సిటీ పోలీస్ వారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకోసమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ డైలాగ్ ను వాడేసుకున్నారు. డిసెంబర్ 22 న విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతుంది. భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దుమ్ము రేపుతుంది. ఈ సినిమా లోని ఫైట్స్ మరియు ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా సలార్‌ లోని పాపులర్ డైలాగ్‌ని ఉపయోగించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వచ్చే నష్టాలను తెలిపేలా ఓ వీడియో క్రియేట్ చేశారు.సోషల్ మీడియాలో హైదరబాద్ సిటీ పోలీస్ ఆ వీడియోను షేర్ చేసింది. అందులో సలార్‌ లో ప్రభాస్ డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ లిక్కర్, యాక్సిడెంట్ ఫొటోలను చూపించారు. “ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పాగా” అని ప్రభాస్‌ డైలాగ్‌ కు లిక్కర్ ఫొటోలు పెట్టి దాన్ని ముట్టుకోవద్దు అని అర్థం వచ్చేలా క్రియేట్ చేశారు.తర్వాత “ప్లీజ్ ఐ కైండ్‌ లీ రిక్వెస్ట్” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని పేర్కొంటూ కారు ప్రమాదాలు జరిగిన విజువల్స్ ను చూపించారు. ఇలా సలార్‌లో ప్రభాస్ డైలాగ్స్‌ ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల క్షేమం కోసం పోలీసులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది..ఇలా పోలీసులు సినిమా లో పాపులర్ డైలాగ్ తో ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నారు.

Exit mobile version