Site icon NTV Telugu

Hyderabad: డీసీపీపై కత్తితో దాడి కేసు.. పోలీసులు సీరియస్..!

Dcp

Dcp

Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్‌ విక్టోరియా గ్రౌండ్ కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసలు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డీసీసీ చైతన్య, గన్మెన్ సత్యనారాయణ మూర్తిపై మోస్ట్ వాంటెడ్ ఉమర్ కత్తితో దాడి చేసిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నిందితుడు ఓమర్ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. బంజారా హిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి నిన్న నైట్ డిశ్చార్గ్ డీసీపీ & గన్ మెన్ సత్యనారాయణ మూర్తి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే.. నిందితుడు ఓమర్‌పై 20 కేసులు ఉన్నాయి. రెండు సార్లు పీడీ యాక్టులు నమోదయ్యాయి. ఇటివలే రెండేళ్లు జైలుకు వెళ్లి విడదలయ్యాడు. ఓమర్ దొంగతనాలు చెయ్యడంతో దిట్ట..

READ MORE: Mass Jathara : మాస్ జాతర రిలీజ్ పోస్ట్ పోన్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?

అసలు ఏం జరిగింది..?
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ విక్టోరియా గ్రౌండ్‌ వద్ద నిన్న కాల్పులు కలకలం సృష్టించాయి. విధి నిర్వహణలో భాగంగా వెళ్లి వస్తున్న హైదరాబాద్​ సౌత్​ ఈస్ట్​ జోన్​ డీసీపీ చైతన్య సెల్‌ఫోన్‌ దొంగలను గుర్తించారు. పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో వారు తిరగబడి డీసీపీపై కత్తితో దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణ కోసం వారిపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిందితుడికి రెండు చోట్ల బుల్లెట్‌ గాయాలు కాగా చికిత్స నిమిత్తం నాంపల్లిలోని కేర్​ ఆసుపత్రికి తరలించారు.

READ MORE: Beggar Woman: వామ్మో.. ఆమె దగ్గర అన్ని పైసలా.. నోళ్లెబెట్టిన జనం..

హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య సీపీ కార్యాలయంలో మీటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా గ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు నిందితులు ఆటోలో వెళ్తున్న ప్రయాణికుల నుంచి సెల్‌ ఫోన్‌ కొట్టేసే ప్రయత్నం చేశారు. అటుగా వెళ్తున్న సౌత్‌ ఈస్ట్‌ జోన్ డీసీపీ చైతన్యకుమార్ అది గమనించి తన వాహనాన్ని ఆపి ముందుగా గన్‌మెన్‌ను పంపించారు. గన్‌మెన్‌ నిందితుల్లో ఒకర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే నిందితుడు కత్తితో గన్‌మెన్‌పై దాడికి యత్నించాడు. గమనించిన డీసీపీ వెంటనే నిందితుల్ని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో డీసీపీ కిందపడిపోయారు. నిందితుడు కత్తితో దాడికి దిగుతుండటంతో పరిస్థితి తీవ్రత విషమించుతుందని భావించిన డీసీపీ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓమర్ అనే నిందితుడికి చేయి, కడుపు వద్ద బుల్లెట్ గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version