NTV Telugu Site icon

Hyderabad: మిక్చర్ బయట షాపుల్లో కొంటున్నారా? ఇది తెలిస్తే జన్మలో కొనరు..

Snackss

Snackss

ఈరోజుల్లో ఇంట్లో స్నాక్స్ చేసుకోవడానికి టైం లేక అందరూ బయట షాపుల్లో దొరికే వాటిని కొంటుంటారు.. ఈ మధ్య ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టం..సొంత బ్రాండ్ల తయారీలోనూ తమదైన మార్క్‌ను చూపుతున్నారు కొందరు కేటుగాళ్లు.. కళ్ళను కూడా మోసం చేసే విధంగా అందంగా ఫ్యాకింగ్ చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలుకు నకిలీ కలిపి మార్కెట్లో.. విక్రయిస్తున్నారు కల్తీగాళ్లు..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ చూసిన అదే మోసం. జనం కళ్లు గప్పడం, దోచుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..ఇప్పుడు బయట పరిస్థితి అలానే ఉంది.. ఏం కొనాలన్న ఏం జరుగుతుందో అని జనాలు భయపడుతున్నారు.. నీళ్ల నుంచి పాలు, నెయ్యి, టీపొడి, పిల్లల పాల పొడి అన్ని కల్తీమయం అయ్యాయి.. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినే మిక్చర్ కూడా కల్తీ అయ్యిందని తెలుస్తుంది..

ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయి. ఆ మిక్చర్ కాని కొంతకాలం తింటే క్యాన్సర్‌ను రా.. రమ్మని ఆహ్వానించినట్లే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్‌లో మిక్చర్ బూంది తయారు చేస్తున్న కంపెనీపై మల్కాజిగిరి ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కొన్ని దుకాణాల పై దాడులు చేశారు.. ఈ దాడుల్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి..బయట తినడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు వైద్యులు. రెడిమేడ్‌కు అలవాటు పడిన కారణంగా..ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా మారింది.. సో జాగ్రత్తగా ఉండటం మంచిది..

Show comments