Site icon NTV Telugu

Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!

Hyderabad Bomb Threat

Hyderabad Bomb Threat

హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ఈరోజు తెల్లవారుజామున మెయిల్‌ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌, సిటీ సివిల్‌ కోర్టు, సికింద్రాబాద్‌ కోర్టు, జింఖానా క్లబ్‌లో సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్‌గా సిటీ పోలీసులు గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి కోసం ఆరా తీస్తున్నారు.

Also Read: Saiyami Kher: ఏడాదిలో రెండు సార్లు.. తొలి భారతీయ నటిగా ‘సయామీ ఖేర్’ చరిత్ర!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. తెల్లవారుజామున 3.43 గంటలకు ఆగంతకుడు రాజ్‌భవన్‌, పాతబస్తీ సిటీ సివిల్‌ కోర్టు, జింఖానా క్లబ్‌, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్‌లో పేర్కొన్నాడు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఆగంతకుడు మెయిల్‌ చేయగా.. పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు ప్రాతాల్లో తనిఖీలు చేయగా ఏమీ దొరకలేదు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Exit mobile version